మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Purchase center started under the auspices of the women's association.నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలోని ఆర్టీసీ గ్రౌండ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తేజోవతి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలన్నారు. దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. “ఏ” వన్ గ్రేడ్ వరి ధాన్యానికి కింటాకు రూ. 2,320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, నిర్వాహకులు (కల్లం ఇంచార్జ్) చర్ప రవి, ఏఈఓ లు దుర్గాప్రసాద్, జీవన్ రెడ్డి, రాజ్ కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భర్త పురం నరేష్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, బండారి చంద్రయ్య, సలెందర్, రైతులు భద్రయ్య, మోగిలి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.