కలెక్టర్ పై దాడి హేయమైన చర్య..

Attack on collector is a heinous act..– తహశీల్దార్ వీరగంటి మహేందర్ 
నవతెలంగాణ – పెద్దవంగర
జిల్లా మెజిస్ట్రేట్ గా అత్యున్నత పోస్టుల్లో ఉన్న జిల్లా కలెక్టర్ పైన దాడి హేయమైన చర్య అని తహశీల్దార్ వీరగంటి మహేందర్ అన్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ, మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ భూ సేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామ సభకు వెళ్లిన అధికారుల కార్లపై అల్లరి మూకలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో కలెక్టర్ తో పాటు అధికారులు, చివరికి పోలీసులు సైతం అక్కడ నుంచి కారులో తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కలెక్టర్ కే భద్రత లేనప్పుడు అధికారులు, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని, లేనిపక్షంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, సీనియర్ అసిస్టెంట్ నరేంద్ర రాజు, జూనియర్ అసిస్టెంట్ శ్రీష, ఎస్కే పర్వీన్, జమున, యాకుబ్ పాషా, తరుణి, స్వరూప, యాకయ్య, మైబూబ్ పాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.