– యూనివర్సిటీ డీన్ డా.జల్లా సత్యనారాయణ
– అగ్రికల్చర్ కళాశాలలో రాష్ట్రస్థాయి కల్చరల్ పోటీలు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
వచ్చే సంవత్సరం జనవరి లో జరిగే జాతీయ స్థాయి కల్చరల్ పోటీల్లో వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచాలని అగ్రికల్చర్ కళాశాల యూనివర్సిటీ డీన్ డా.జల్లా సత్యనారాయణ అన్నారు. మండలంలోని జిల్లెల్ల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో రాష్ట్రస్థాయి కల్చరల్ పోటీలు మంగళవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కళాశాలల యూనివర్సిటీ డీన్ జల్లా సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి కల్చరర్ పోటీలు మూడు రోజులపాటు ఇక్కడ జరుగుతాయన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కల్చరల్ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే సంవత్సరం జనవరి నెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కల్చరల్ పోటీల్లో మన రాష్ట్రం నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని ఆ విద్యార్థులు వ్యవసాయ కళాశాల విద్యార్థులేనని ధిమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో 11 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో 26 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ శ్రీదేవి, అధ్యాపకులు సంపత్ కుమార్ పాల్గొన్నారు.