ఏర్గట్ల మండలకేంద్రంలోని కేజీబీవీని మంగళవారం జీసీడీఓ( గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్) భాగ్యలక్ష్మి సందర్శించారు.విద్యార్థిని అంజలి ఆదివారం రోజున భవనం పై నుండి పడిన ఘటన వివరాలను పాఠశాల ఉపాధ్యాయురాలు లలిత భార్గవిని అడిగితెలుసుకున్నారు. విద్యార్థులను డ్యూటీలో ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కనిపెడుతూ..ఉండాలని అన్నారు.భవనం పై అంతస్థు పనులు పూర్తి కానందున విద్యార్థులను ఎవరిని పైకి ఎక్కవద్దని సూచించారు.భవనం పైకి వెళ్ళే మార్గాన్ని, పని పూర్తి అయ్యేంత వరకు మూసివేయాలని సూచించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు మంగళవారం వెళ్ళడం జరిగిందని,ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుగానే ఉందని,వైద్య ఖర్చుల విషయాన్ని పై అధికారులకు తెలిపి,బాధిత కుటుంబానికి సహాయం దిశగా ప్రయత్నిస్తామని అన్నారు.