
మోపాల్ మండలంలోని బోర్గాం పి సొసైటీ పరిధిలో జిల్లా సహాకార అధికారి ఆదేశాలనుసారము 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బోర్గాం(పి) సంఘ అద్యక్షులు ఎన్డిసిసి బ్యాంకు వైస్ చైర్మన్ శ్రీ యన్.చంద్రశేఖర్ రెడ్డి సహకార జెండా ఆవిష్కరించడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా తెలంగాణ సహకార యూనియన్ నుండి ప్రిన్సిపాల్, వెంకయ్య మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ , సంఘ కార్యవర్గ సభ్యులు, ప్రాధమిక పాఠశాల విద్యార్థులు, సంఘ సిబ్బంది, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.