ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తులు పొడిగింపు..

Extension of applications in Govt Medical College..– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ల కొరకు ఈ నెల 20 వ తేది వరకు పొడగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక  ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ అక్టోబర్ 21 న నోటిఫికేషన్ రావడం జరిగిందని, నవంబర్ 20 వరకు చివరితేదని , ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యేందుకు నవంబర్ 25వ తేదీ వరకు పూర్తవుతుందని, డిసెంబర్ 2 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని తెలిపారు.  ఈ అనుబంధ ఆరోగ్య కోర్సులు 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులు, అర్హత పరీక్ష ఇంటర్మీడియట్ మార్కులు.  ఈ అడ్మిషన్లలో రిజర్వేషన్ నియమ నిబంధనల ప్రకారం ( ఎస్సీ-శాతం , ఎస్టి -10 శాతం, బి సి ఎ-7 శాతం, బిసిబి -10 శాతం, బీసీసి-1శాతం, బీసీడి-7 శాతం, బీసీ ఈ-4 శాతం & ఈ డబ్ల్యూ ఎస్ -10 శాతం). ఎస్ టి లో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, రిజర్వ్ చేయబడిన సీట్లు ఎస్సీ లేదా వైస్ వెర్సా వారికి అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు. ట్యూషన్ ఫీజు రూ. సంవత్సరానికి 6000/- చెల్లించాలనీ, ఈ మొత్తాన్ని బలహీన వర్గాల అభ్యర్థులకు సాంఘిక సంక్షేమ శాఖ (ఈ పాస్) ద్వారా తిరిగి చెల్లించబడుతుందనీ తెలిపారు. ఈ కోర్సు చేసిన  విద్యార్థులకు  ఎక్కువ డిమాండ్ ఉంటుందని,   ప్రభుత్వ , ప్రైవేట్ రంగాలలో, ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయన్నారు.  విద్య అర్హతలు బైపిసి  గ్రూప్‌తో ఇంటర్మీడియట్ / అందుబాటులో లేకపోతే ఎంపీసీ గ్రూప్/ లేకపోతే ఇతర గ్రూప్ ఇంటర్మీడియట్ పరిగణించబడుతుందనీ తెలిపారు. 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు కొరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్  యాదాద్రి నందు డి ఎ ఎన్స్  30 సీట్లు (డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్). డి ఈ సి జి 30 సీట్లు  (డిప్లొమా ఇన్ ఈ సి జి) ఉన్నాయని తెలిపారు. ఈ కోర్సు కొరకు దరఖాస్తులను పారామెడికల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని www.tgpmb.telangana.gov.in వెబ్ సైట్ నందు మరియు దరఖాస్తులను పూరించి అన్ని అర్హత ఉన్న సంబంధిత పత్రాలతో 20.11.2024 లోపు ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ యాదాద్రి భువనగిరి  కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన ఏవైనా సందేహాల కోసం టిజి పి ఎం బి ,మెయిల్: secy_pmb@telangana.gov.in     లేదా 040-24653519 కు సంప్రదించాలని కోరారు.