– హావర్డ్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ శశికళ
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
స్వచ్ఛమైన మనసుతో ఉండే పిల్లలందరూ ఒక మట్టిముద్ధలాంటి వారని, వారిని సమాజానికి కావలసిన రీతిలో మలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీచర్ దే అని హోవర్డ్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ శశికళ అన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్ లోని రోటరీ నగర్ నందు గల హోవర్డ్ హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలే కాకుండా వారిని మురిపించడానికి ఉపాధ్యాయులు చేసిన కామెడీ స్కిట్, ఫేక్ న్యూస్ స్కిట్, నృత్యాలు గీతాలు, పొడుపు కథలు పిల్లల్ని అలరించాయి. పిల్లలు చేసిన సెల్ ఫోన్ స్కిట్ దాని దుర్వినియోగం పై పిల్లలకు తెలియజేసేలా అవగాహన కల్పించారు. ముందుగా విద్యార్థులకు బెలూన్లు ఇస్తూ పూలు జల్లుతూ స్కూల్లోకి ఆహ్వానం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ పివిఆర్ మూర్తి మాట్లాడుతూ పిల్లలందరూ పెద్దలు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు టీచర్లు చెప్పిన సలహాలను సూచనలను తప్పక అనుసరించాలని అప్పుడే జాతి గర్వించదగిన పౌరులుగా మారతారని మార్గదర్శకం చేస్తూ పిల్లలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు, పాల్గొన్నారు.