నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే సహకారంతో వేసిన బోరులో బోరు మోటర్ ను బిగించడం జరిగిందని సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి, సమస్యలు పరిష్కరానికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాదవ రెడ్డి, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.