శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Devotees flock to Sri Matsyagiri Lakshmi Narasimhaswamy Templeనవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిరోజు స్వామివారికి మూర్తికుంబారాధన,చతుస్థానార్చన,నిత్యాహోమాలు, ద్వారతోరణ బలి, మహాపూర్ణహుతి చక్రతీర్థము,నివేదన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమం జరిగినది.కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేడు ఆలయంలో గల హుండీలు లెక్కించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ధర్మకర్తలు,
అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.