మాల సంఘం జిల్లా అధ్యక్షునిగా మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన సంకిరతన్ కుమార్ ను శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు అయ్యాల సంతోష్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రతన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన కార్యదర్శి నీరెడ్డి మైసయ్య, కోశాధికారి మైండ్ల ప్రభాకర్, ఉపాధ్యక్షులు కప్ప సత్యం సిద్దార్థ్ రాజ్,పంతంగి పెద్ద సాయిలు, వాగ్మారే లక్ష్మణ్, పసుల నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ.. మాలల హక్కుల కోసం,మాలల సమస్యల పట్ల పోరాడటమే, ఈ సంఘం ప్రధాన ఉద్దేశం అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పంతంగి సాయిలు పోతురాజు సాయి బాబా పంతంగి పాపయ్య సాయిలు రాజు నరేష్,ప్యారారం మైషయ్య,కాశీరం తదితరులు పాల్గొన్నారు.