– సిద్దిపేటలో హుస్నాబాద్ ప్రాంతం పై నిర్లక్ష్యం
– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
బీడు భూములలో రైతులు వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్ లో ప్రాజెక్టులను నిర్మించేందుకు పనులు ప్రారంభించిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీరు అందించే ప్రక్రియ వేగవంతం చేస్తే ఇబ్బంది లేకుండేదన్నారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుండా భూ నిర్వాసితుల ఆంక్షల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రాజెక్టు నింపితే కింది పొలాలకు నీరు అందించే నెట్వర్క్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు . రిజర్వాయర్ లో నీళ్లు ఉంచడం ఒకటే కాదు కదా ప్రాజెక్టు ప్రక్రియ ఎందుకు చేయడం లేదన్నారు.గండి పల్లి ప్రాజెక్ట్ కాలువలు, గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ప్రక్రియలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. గౌరవెల్లి గండిపల్లి దశబ్ది కాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే..రంగనాయక, కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ఏట్లా పూర్తయిందన్నారు. సిద్దిపేటలో హుస్నాబాద్ అంతం అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు.2023లో బిఆర్ఎస్ కాలం ముగిస్తుందని, 24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కాలువలు పూర్తి చేసుకుందామన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో హుస్నాబాద్ లో ఆర్డిఓ ,డి ఈ ఆఫీస్ తో పాటు అనేక కార్యాలయాలు తీసుకొచ్చామాన్నరు. హుస్నాబాద్ కు హరీష్ రావు ఇచ్చిన నిధులలో అమలైనవి ఏన్ని… పనులు ఎందుకు కాలేదో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. హుస్నాబాద్ కు వెటర్నరీ, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వస్తదా అని చూస్తే సిద్దిపేటలోనే పెట్టుకున్నారన్నారు. హుస్నాబాద్ కు విద్యాలయం కావాలని కోరుకుంటే హుస్నాబాద్ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కు బహిరంగ సవాల్ చేస్తున్న ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాలు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా 5 కాలంలో హుస్నాబాద్ ప్రాంతానికి ఏం నిధులు తీసుకువచ్చా బహిరంగంగా చెప్పాలన్నారు. నిధులు తీసుకువచ్చి అమలు చేసే అవకాశం ఉన్న ఎందుకు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి బహిరంగంగా ప్రజల ముందు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని,మీరు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట మండల అధ్యక్షులు జంగ పల్లి అయిలయ్య తదితరు పాల్గొన్నారు.