అధిక ధరలు వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ..

Gas agency charging high prices.నవతెలంగాణ – చండూరు  
శ్రీ సాయి దుర్గ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నల్లగొండ యజమాన్యం వారు చండూరులో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పై అధిక ధరలు మసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్యాస్ ధర రూ.874 అయితే శ్రీ సాయి దుర్గ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వారు వినియోగదారుల నుండి రూ.930 వసూలు చేస్తున్నారు. వినియోగదారుల సబ్సిడీ గురించి, బుకింగ్ గురించి ఏజెన్సీ వారిని వివరణ అడిగితే వారు వినియోగదారుని పట్ల అగౌరవంగా, అమర్యాదగా మాట్లాడుతూ అహేళన చేస్తూ మిగితా కంపెనీల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై చండూరు మండల పరిసర ప్రాంత వినియోగదారులు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు నారపాక అంజనేయులు, మాధవి, సైదమ్మ, భూపాల్రెడ్డి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.