కేటీఆర్‌ ముచ్చట పడుతుండు!

వయస్సుకొచ్చిన అమ్మాయి, అబ్బాయి పెండ్లి చేసుకోవాలని ముచ్చట పడుతుంటారు. ఇది కొత్త విషయ మేమీ కాదు. ఈ విషయం కూడా అన్ని కుటుంబాల్లోని తల్లిదండ్రులకు అనుభవమే. ఒకరికి ఇంజనీరింగ్‌ చదవాలని ఉంటే, మరికొందరికి ఎంబీబీఎస్‌ చదవాలని ముచ్చట ఉంటది. చాలామంది కంప్యూటర్‌ కోర్సుపై ముచ్చట పడుతున్నారు. నచ్చిన ఉద్యోగాలపై యువత ముచ్చట పడుతుంది. దానికి అనుగుణంగా ఎవరి ప్లాన్‌ వారికి ఉంటుంది. ఏ ప్లాన్‌ లేని వారు కూడా ఎలాగో, అలాగా బతికేయాలనే ప్లాన్‌తో ఉంటారు. ప్రస్తుతం మందుపై మనస్సు పారేసు కోవడం ఓ ట్రెండ్‌గా మారింది. అది వారి ముచ్చట. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలకు కొత్త కొత్త రంగాలపై ముచ్చట పడుతున్నారు. ముఖ్యంగా యువ నేత కేటీఆర్‌ కొత్త అనుభవం కోసం ముచ్చట పడుతున్నారు. ఆయన జైలు జీవితాన్ని బలంగా కోరుకుం టున్నారు. జైలంటే నేరస్తులను సంస్కరిం చేదిగా విన్నాం. కానీ ఆయన ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి జైలుకు పోతానని చెబుతున్నారు. అయితే జైల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తారా? రోజు జిమ్‌కెళ్లి కండలు పెంచు కునే అవకాశం జైల్లో ఉంటుందా? ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు ఆయనకు ట్రైనర్‌ ఉంటాడా? ఏమే కేటీఆర్‌ జైలుకు పోయ్యేందుకు తెగ ఉవ్విళ్లురుతున్నా రంటే, ఇవన్నీ సిద్ధం చేసుకున్నా రా? అనే అను మానాలు వస్తున్నాయి. ఉచిత ఫిట్‌నెస్‌ కోసం జైలుకే వెళ్లాలా? హైదరాబాద్‌లో అనేక పార్కుల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లున్నాయి కదా? అక్కడికెళ్లండి, జైలుకెందుకు? అని నెటిజన్లు సోషల్‌మీడియాలో తెగ ముచ్చటలాడుకుంటున్నారు.
– గుడిగ రఘు