హైదరాబాద్ : తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో ఎన్నికలు జరుగనుండగా.. అధ్యక్ష, కార్యదర్శి పదవి రేసు ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, చాముండేశ్వరినాథ్‌లు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతుండగా.. ప్రధాన కార్యదర్శి పదవికి పి. మల్లారెడ్డి, సి బాబురావు రేసులో ఉన్నారు. కోశాధికారి పదవికి సతీశ్ గౌడ్, ప్రదీప్ కుమార్ రేసులో నిలిచారు. ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు!.ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ తుది నామినేషన్ల జాబితాను వెల్లడించారు.