– ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్
కోయంబతూర్ : ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్) ఫైనల్ రౌండ్ తొలి రోజు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు డబుల్ పోడియం సాధించింది. శనివారం జరిగిన ఫార్ములా 4 ఇండియన్ ఓపెన్, ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) ఫైనల్ తొలి రౌండ్ రేసుల్లో బ్లాక్‌బర్డ్స్ రేసర్లు అఖిల్ అలీభారు, నీల్ జానీ తమ మెరుపు వేగంతో ఒకటి, రెండవ స్థానాల్లో నిలిచారు. ఫార్ములా4 ఇండియన్ ఓపెన్ రేసులో అఖిల్ (దక్షిణాఫ్రికా) 26 నిమిషాల14.474 సెకన్లలో రేసు పూర్తి చేసి టాప్ పొజిషన్‌లో నిలిచాడు. ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయం సాధించాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ తొలి రేసులో గోవా ఏసెస్ డ్రైవర్ సోహిల్ షా 26 నిమిషాల 34.598 సెకన్ల సమయంతో అగ్రస్థానంలో నిలువగా.. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ నీల్ జానీ (స్విట్జర్లాండ్) 26 నిమిషాల 51.754 సెకన్లతో రెండో స్థానంతో పోడియంపై నిలిచాడు.