– కొనసాగనున్న ఎఫ్‌పీఐ విక్రయాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారమూ అనిశ్చిత్తి కొనసాగవచ్చని అంచనా. గడిచిన 20 సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతం నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐ) తమ పెట్టుబడులను భారీగా తరలించుకుపోయారు. ఇదే పరిస్థితి నవంబర్ 18తో ప్రారంభమయ్యే వారంలోనూ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20న మార్కెట్లకు సెలవు. మిగితా నాలుగు రోజులు ట్రేడింగ్ కొనసాగనుంది. ఎన్ఎస్డీఎల్ గణంకాల ప్రకారం.. నవంబర్ ప్రథమార్థంలో రూ.22,420 కోట్ల విలువ చేసే ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్లిపోయాయి.