
ప్రతిభావంతులైన కళాకారులు, నటులను ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాలని ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో పాటు తాజాగా హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న నటుడు చరణ్ బోనాల శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. బుధవారం గౌలిగూడలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో బోనాల శ్రీనివాస్ చరణ్ ను శాలువా, పూలమాలతో సన్మానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా ఏక్తా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ శర్మ, రేసుకుంట్ల ముకేష్ మేరు, మిద్దెల నరేష్ గౌడ్, శ్రీను దాసరి తదితరులు పాల్గొన్నారు.