పిల్లల ఆస్పత్రిలో పిల్లల పుస్తకావిష్కరణ

Children's Book Launch at Children's Hospital– ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
బాల సాహిత్యంలో అధిక రచనలు, ఆనేక ప్రక్రియల్లో రచించిన రచయత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ రచించిన “ఏనుగును పెంచుకుందాం” పుస్తకాన్ని సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్  ఆవిష్కరించారు. ఆస్పత్రితో ఉన్న బాల బాలికల మధ్య బాల సాహిత్యాన్ని ఆవిష్కరించడంమంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా స్కూళ్ళలో పుస్తక ఆవిష్కరణలు జరగడం చూశాము. కానీ పిల్లల ఆసుపత్రిలో పిల్లల పుస్తకం విడుదల చేయటం ఆనందదాయకమని అన్నారు. తెలుగు భాషకూ, తెలుగు సాహిత్యానికీ ఎక్కువ ప్రాచుర్యం కల్పించడం,  విద్యార్థులను భాగం చేస్తున్నందుకూ సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ కందేపి ప్రసాదరావును ప్రశంశించారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు, మాజీ ఐఎపి ప్రెసిడెంట్ డాక్టర్ కందేపి ప్రసాదరావు మాట్లాడుతూ మొదటి నుంచీ తెలుగు భాషా ప్రచారంలో తమ ఆస్పత్రి ముందుంటుందనీ, తమ ప్రిస్కిప్షన్ ప్యాడ్ మీద పాటలు, పొడుపు కథలు ఉంటాయనీ అన్నారు. పిల్లలు చిన్నతనంలో చేసిన అల్లరి పనులు పెద్దయ్యాక ఇంట్లో వాళ్ళు చెప్పుకుని నవ్వుకుంటారు. ఇలాంటి అల్లరి పనులను పదిమందీ చూసి చదివి ఆనందపడుతారనీ ‘స్కెచ్’ ల ప్రక్రియలో డాక్టర్ రాణీప్రసాద్ ఈ పుస్తకాన్ని వెలువరించారు. పిల్లల అమాయకత్వం సునిశిత తత్వం, ఆలోచనా విధానం, ప్రశ్నించేతత్వం వంటివన్నీ పిల్లల మనస్తత్వానికి అడ్డం పడతాయి. పిల్లలు పెరిగే సమయంలో మంచి విషయాలు నేర్పించాలి. కల్మషం, అసూయ, ద్వేషం, వంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచితే మంచి వాతావరణం నెలకొంటుంది. ఈ పుస్తకం లో డాక్టర్ రాణీప్రసాద్ తో పాటు ఆమె తల్లి క్రీ.శే. అంగలకుదిటి గోవిందమ్మ రాసిన అల్లరి కథనాలు సైతం ఉన్నాయి. శ్రీకృష్ణుని అల్లరి పనులను పోతన భాగవతంలో అధ్బుతంగా చెప్పాడు. పిల్లల అల్లరి కథనాలను రాసినవారు అతి తక్కువ మంది ఉన్నారు. పిల్లల హాస్పిటుల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి ప్రతిరోజూ పిల్లలతో మమేకం కావడం వల్ల పిల్లల కోసం ఆమె అత్యధిక రచనలు చేశారు. తమ ఆస్పత్రితో రోగులకు శారీరక వైద్యంలో పాటు మానసిక వికాసం, పరిణణి కలిగిస్తూ విద్యార్ధులను, తల్లులను చైతన్య వంతం చేయటంలో ఆగ్రశ్రేణిలో ఉన్నారు. కార్యక్రమంలో నియోనేటాలజిస్ట్ డాక్టర్ స్వాప్నిక్, డాక్టర్ రవి కుమార్, హాస్పిటల్ మేనేజర్ సృజన్ పాల్గోన్నారు.