చిత్రలేఖనం పోటీలు..

Painting competitionsనవతెలంగాణ – భువనగిరి 
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ చైర్మన్  కరిపే నరసింగ రావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బగాయాత్  ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఆర్టిస్టు  ఆవుల వినోద్  పాల్గొన్నారు.  ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసినారు. టీ మధుసూదన్ రెడ్డి గ్రంథాలయ అధికారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులందరూ ప్రసంగించి పోటీలను ప్రారంభించినారు. ఈ పోటీలకు బగాయాత్ హై స్కూల్, బీచ్ స్మైల్ స్కూల్, గంజి హై స్కూల్ ,గర్ల్స్ హై స్కూల్, మైనారిటీ గురుకుల ,సోషల్ వెల్ఫేర్, బీసీ గురుకుల ,జూనియర్ కాలేజ్ హై స్కూల్ పాఠశాలల నుండి 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ జంపాల అంజయ్య గారు,మాటూరి బాలేశ్వర్ , ఉపాధ్యాయులు, కే శ్రీనివాస్, పురుషోత్తం రావు, రమేష్ మరియు లైబ్రేరియన్స్ సిహెచ్ రుకోధర్,టి యాదగిరి, స్వామి గ్రంధాలయ ఉద్యోగులు కావ్య, శ్రీనివాస్, లక్ష్మమ్మ పాల్గొన్నారు.