నాందేడ్ లో మంత్రి ఉత్తమ్ ను కలిసిన ఎమ్మెల్యే

MLA met Minister Uttam in Nandedనవతెలంగాణ – మద్నూర్

మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ ను నాందేడ్ జిల్లా కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కలిశారు. రాష్ట్రమంత్రికి బొక్కేను అందజేస్తూ జుక్కల్ నియోజకవర్గం సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీని యువ నాయకులు అమూల్ వట్నాల రమేష్ సంతోష్ మేస్త్రి బాలు యాదవ్ తదితరులు ఉన్నారు.