సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలి

A comprehensive house-to-house family survey should be expeditedనవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎన్యూమరేటర్ల కు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆయన మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో సర్వే జరుగుతున్న తీరును సూపర్వైజర్లను అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వద్దని, కుటుంబ యజమాని తెలిపిన మేరకు సమగ్రంగా కుటుంబ సభ్యుల వివరాలు సర్వే పత్రాల్లో నమోదు చేయాలన్నారు. సర్వే పట్ల  ప్రజలు ఎలాంటి అపోహాలకు లోను కాకుండా సమగ్రంగా  వివరాలు అందించి ఎన్యూమరేటర్ల కు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు శాంతి కుమార్, నరేందర్, తదితరులు ఉన్నారు.