మండలంలోని రంగంపేట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎన్కంపల్లి మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బండి పోచయ్య తదితరులు ఉన్నారు.