ఆదిలాబాద్ ప్రజల చిరకాల వంచ అయిన ఆదిలాబాద్ టూ ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వేలైన్ పనులకు సంబంధించి సర్వే పూర్తి అవుతుందని, జనవరి నాటికల్ల రిపోర్టును కేంద్రానికి అందించడం జరుగుతుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఇటీవల నాందేడ్ డివిజన్ రైల్వే సలహా మండలి సభ్యునికిగా నియమకమైన ఉష్కం రఘుపతి మంగళవారం ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ నివాసంలో కలిసి శాలువతో సత్కరించి సభ్యుడిగా నియమించడంలో కీలకంగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కూడా రైల్వే సలహా మండలి సభ్యుడు రఘుపతిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… ఆదిలాబాద్ కు కేంద్రం నుంచి పూర్తి సహకారం, నిధులు తీసుకువచ్చేలా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కృషి చేస్తామన్నారు. ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వే లైన్తో పాటు 2017లో మంజూరైన పిట్రైన్ జనవరి, మార్చిలోగా పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ టూ గడ్చాందుర్, ముత్కేడ్ నుంచి పిప్పల్ కోటి వరకు డబుల్ లైన్ సర్వే కొనసాగుతుందన్నారు. వీటిని త్వరతగతిన పూర్తి చేసేల కృషి చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్లో నాణ్యమైన సేవలు అందించేల సలహాల మండలి సభ్యులు కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దారట్ల జీవన్, రాష్ట్రపాల్, విఠల్ ఉన్నారు.