నియోజకవర్గానికి ఎస్‌డీఎఫ్ కింద మంజూరైన రూ.4 కోట్ల నిధులలో 21 శాతం 86 లక్షల రూపాయలను మసీదుల అభివృద్ధి కోసం కేటాయించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని ప్రజాసేవా భవన్, క్యాంపు కార్యాలయంలో మైనార్టీ పెద్దలు, మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రొసిడింట్ కాపీలను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి ఫలితం ఆశించకుండా 115 పనులకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రొసిడింగ్‌లు ఇచ్చామన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధే లక్ష్యంగా, అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగాఅందరినీ కలుపుకునిపోయి ముందుకుసాగుతామని అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను నిత్యం ప్రజల సేవలోనే ఉంటానన్నారు. పేదరిక నిర్మూలనకు అంతా కలిసికట్టుగా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పెద్దలతో పాటు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.