నవతెలంగాణ – వలిగొండ రూరల్
ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ జిి.వీరారెడ్డి కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని సంగెo లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం దిగుమతిలో రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దని ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లు యజమానులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండలంలోని సంగెo లోని ధాన్యలక్ష్మి పారా బాయిల్డ్ అండ్ రైస్ ఇండస్ట్రీస్ ను ఆయన సందర్శించి కొనుగోలు కేంద్రాలనుండి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోలు కేంద్రం నుండి లారీలలో వచ్చిన ధాన్యం దిగుమతిని పరిశీలించి మిల్లు యజమానితో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలనుండి లారీలలో వచ్చిన ధాన్యాన్ని సమయానుకూలంగా దిగుమతులు చేసుకోవాలని, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి ధాన్యం కటింగ్ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మిల్లు యజమానికి సూచించారు. ఆయనతోపాటు స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.