
పొగాకు వాడకంతో అనారోగ్యం తప్పదని డాక్టర్ నిమ్రాతరుణమ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పొగాకు వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పొగాకు వాడకం కొద్ది కొద్దిగా మానవ శరీరంలో ప్రవేశించి ఒక్కో అవయవాలను పాడుచేస్తుందన్నారు. అలాగే ముఖ్యమైన అవయవాలైన కాలేయం, ఊపిరితిత్తులు, గుండేలాంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. అతివాడకంతో క్యాన్సర్‌లాంటి వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. విద్యార్థిదశ కీలకమైనదని ఇలాంటి చెడువ్యసనాలకు లోనుకాకుండా తగు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ మహమూద్, సూపర్‌వైజర్ సుభద్ర, ఫార్మసిస్ట్ సమ్మయ్య, ఏఎన్‌ఎం గోవిందు మంజుల, ఆశా కార్యకర్తలు కవిత, పుష్ప, ఉపాధ్యాయులు ఓదేలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.