
వరి కొయ్యలను కాల్చడం వలన తీవ్ర నష్టాలు కలుగుతాయని మండల వ్యవసాయ అధికారి సతీష్ అన్నారు. మంగళవారం మండలంలోని తంగళ్ళపల్లి, వరికోలు గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ఇతర పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి ఆరోగ్యం, పర్యావరణం, రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. రైతులు పంట మిగుల్లను కాల్చకుండా ప్రకృతి పద్ధతులు అనుసరించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. పంట అవశేషాలను దహనం చేయడం వలన పోషకాల నష్టం, వాయుకాలుష్యం, కీటకాల పెరుగుదల, జీవవైవిధ్యం తగ్గడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వంటి నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు శివకుమార్, టి.ప్రణీత, రాకేష్, శ్రీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రైతులు, గ్రామస్థులు , తదితరులు పాలొన్నారు.