– వివరాల నమోదుకు ప్రజల సహకారం
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక,ఆర్థిక,విద్య,రాజకీయ సమగ్ర ఇంటింటి సర్వే అధికారుల ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతోంది. మండలంలోని అయా గ్రామాల్లో సమగ్ర ఇంటింటి సర్వే సుమారు 65 శాతం పూర్తయింది. దీంతో సమగ్ర ఇంటింటి సర్వేను ప్రజలు ఆదరిస్తూ వివరాల నమోదుకు సహాకారం అందిస్తున్నారు.
మండలంలో 11423 ఇండ్లు..
ప్రభుత్వ అదేశానుసారం సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభంలో ఎన్యూమరేటర్లు ఇంటింటా స్టీక్కరింగ్ చేసి ఇండ్లను గుర్తించారు.సుమారు 11423 ఇళ్లకు స్టిక్కరింగ్ చేశారు.వివరాల నమోదుకు 103 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేసి 10 సూపర్ వైజర్లతో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.ఈ నేల 9 నుండి ఎన్యూమరేటర్లు ఇంటింటా సమగ్ర ఇంటింటా వివరాల నమోదుకు శ్రీకారం చుట్టారు. ఎన్యూమరేటర్లు నమోదు చేసిన వివరాల పత్రాలను తహసిల్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిల్వ చేస్తున్నారు.నిత్యం నమోదు చేసిన వివరాల పత్రాలను భద్రపర్చుతూ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు.
ప్రజలు సహకరిస్తున్నారు..
మండలంలో చేపట్టిన సమగ్ర ఇంటింటా సర్వేకు ప్రజలు సహకరిస్తున్నారు.ప్రజలకు సమగ్ర ఇంటింటా సర్వే అవశ్యకతను వివరిస్తూ తలెత్తుతున్న అపోహలను నివృత్తి చేస్తున్నాం.సర్వే వివరాల నమోదును నిత్యం క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలిస్తున్నాం.30 వరకు సమగ్ర ఇంటింటా సర్వేను పూర్తి చేయాలని ప్రణాళిక రుపోందించుకున్నాం. ఎన్యూమరేటర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి వివరాల నమోదును పూర్తి చేసేల సమాయత్తమవ్వాలి.ప్రజలు ఒకే చోటనే వివరాలందిచాలి.సర్వేకు ప్రజలు సహరిస్తున్నారు: శ్రీనివాస్ రెడ్డి,తహసిల్దార్,బెజ్జంకి.