నవతెలంగాణ – గోవిందరావుపేట
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా డాగ్ స్క్వార్డుతో తనిఖీలు చేపట్టినట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. మంగళవారం మండలంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశానుసారం జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు లేకుండా చేయాలి అనే లక్ష్యంతో పస్రా పోలీసు స్టేషన్ పరిధిలో పస్రా ఎస్ ఐ అచ్చ కమలాకర్, సివిల్ పోలీస్ లు, డాగ్ స్క్వార్డ్ టీముతో ప్రతి కిరణం షాప్ లు, పాన్ షాప్ లు తనికీలు చెయ్యడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లో గంజాయి కాని ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు వినియోగించిన, అమ్మిన వారిపై చట్ట రిత్య చేర్యా తిసుకోబడును. ఎవరికైనా గంజాయి కాని ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు కాని అమ్మినట్టు తెలిసినచో పస్ర పోలీసు లకు సమాచారం తెలుపవలసిందిగా (వారి వివరాలు గోప్యంగా వుంచబడతాయి ) అన్నారు.