టప్రా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా 

Dharna in front of Collectorate led by Tapraనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, వివిధ డిమాండ్లతో కూడిన  వినతి పత్రాన్ని  కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టాప్రా జిల్లా అధ్యక్ష,  కార్యదర్శులు కడారి రమేష్ బాబు బొమ్మ కంటి బాలరాజు లు మాట్లాడుతూ పెంచనర్ల సమస్యను తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ  శాంతకుమారి చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. హెల్త్ కార్డులపై ఈ హెచ్ ఎస్  క్రింద 10 లక్షల గరిష్ఠ పరిమితితో   కంట్రిబ్యూషన్ లేకుండా కార్పోరేట్ హాస్పిటల్స్ లలో నాణ్యమైన వైద్యం అందించాలని , తెలంగాణా 2 వ పి ఆర్ సి  రిపోర్టు తెప్పించుకుని 1-7-2023 నుండి మానిటరీ బెనిఫిట్ చెల్లించు నట్లు డిఎ మెర్జు పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరారు. తెలంగాణా మొదటి పి ఆర్ సి  రికమండు చేసినట్లు 1-7-2018 నుండి 20 సంవత్సరాల సర్వీసుకు ఫుల్ పెన్షన్ చెల్లించాలని, పెన్షనర్లకు బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలని, ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలనారు.  ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఆల్ పెన్షనర్స్ & రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్  గౌరవాధ్యక్షులు పి శంకర్ రెడ్డి, జిట్టా భాస్కరరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం బాలేశ్వర్ ,కోశాధికారి యమగాని బుగ్గయ్య, జిల్లా సహాధ్యక్షురాలు  దుగ్యాల శకుంతల,కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, సహాధ్యక్షులు  సివి , రామ నర్సయ్య, జి లక్ష్మీనారాయణ, ఎండీ జానీ మొయినుద్దీన్, సోమశేఖర్,బి ఆంజనేయులు ,కార్యవర్గ సభ్యులు, జగన్మోహన్, బిక్షపతి, యాదగిరి, శ్రావణ్ కుమార్, అంచేడ్కర్, సుధాకరరెడ్డి, రామచంద్రారెడ్డి, అమీర్ అలీ లు పాల్గొన్నారు.