నవతెలంగాణ – జన్నారం
వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదాగా జీవనం సాగిస్తున్న లంబాడీల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదని, కొడంగల్ నియోజకవర్గం లఘు చర్ల గ్రామంలో అక్రమంగా అరెస్టు చేసిన లంబాడి గిరిజనులను బేసరత్తుగా విడుదల, లంబాడా హక్కుల జాగృతి సమితి జన్నారం మండల అధ్యక్షుడు బాణావత్ సంతోష్ నాయక్ అన్నారు. మంగళవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రుద్రాల మండల లగచర్ల గ్రామం గిరిజన లంబాడిలు తరతరాలు గా సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూములను ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం ఏమైన చర్య అన్నారు.భూములు ఇవ్వమని ఆ గిరిజన లంబాడీలు అనడంతో ఆ లంబాడి గిరిజనులపై పై రాత్రి వేళ విద్యుత్ తొలగించి కనీసం మహిళలను చూడకుండా రాత్రి వేళ విచక్షణ రహితంగా కొడుతూ వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే, జన్నారం మండల కేంద్రంలో లంబాడి హక్కుల జాగృతి సమితి ఆధ్వర్యం లొ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపడం జరిగిందన్నారు.. కార్యక్రమంలో లంబాడ హక్కుల జాగృతి సమితి మండల, కార్యనిర్వక అధ్యక్షులు దినేష్ నాయక్ ఉప అధ్యక్షులు భూక్య సంతోష్ బాదావత్ రాజు భరత్ నాయక్, బివిఎస్ నాయక్ కైలాష్ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.