‘గత నాలుగైదు ఏండ్లుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తు న్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది’ అని చెప్పారు హీరో విశ్వక్సేన్. ఆయన తాజాగా చిత్రం ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.’గ్యాంగ్స్ అఫ్ గోదావరి’, ఈ సినిమా రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేం చెబుతున్న పాయింట్‌తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా ఆ ఎలిమెంట్‌కి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారు. ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి జోనర్ మారుతుంది. సెకండ్ హాఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేం ట్రైలర్లో కథని పెద్దగా రివీల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డైరెక్టర్ని, రైటింగ్‌ని మెచ్చుకుంటారు. ఇది వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని, తీసిన సినిమా. ఈ సంఘటనలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. జేక్స్ బిజోరు మ్యూజిక్, బీజీఎం అదగొట్టేశాడు. పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. మీనాక్షి, శ్రద్దా, నరేష్, రఘు, సునీల్.. ఇలా అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్‌తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రైటింగ్‌కి చాలా మంచి పేరు వస్తుంది. నిర్మాత రామ్ తాళ్లూరి చాలా ఓపికగా ఈ సినిమా చేశారు. ఆ కారణంగానే ఇంత మంచి ప్రాడక్ట్ వచ్చింది. ‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు’.. దీన్ని పాత్రికేయులు ఎవరైనా సరే మంచి ప్రశ్న వేస్తే ఇస్తాం (నవ్వుతూ). ‘లైలా’, సుధాకర్, అనుదీప్ సినిమాలు ప్యార్లల్గా జరుగుతాయి. ‘కల్ట్’ మార్చిలో స్టార్ట్ చేస్తాను.