– మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికార కాంగ్రెస్ మూసీలోనే మునిగి పోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చే ఎన్నికలనాటికి బీఆర్‌ఎస్ ఉండబోదని జోస్యాలు చెబుతున్నారనీ, అది ఎప్పటికీ నెరవేర బోదని అన్నారు.
కాంగ్రెస్‌ను ముంచడానికి రేవంత్ ,మహేష్ కుమార్ గౌడ్ చాలని చెప్పారు. ప్రజల్లో ఎవరిని కదిలించినా రేవంత్ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నదని తెలిపారు. రుణమాఫీ విషయంలో ఆ విషయం బయట పడిందన్నారు. సమన్వయం లేకుండా కాంగ్రెస్ పాలన నడుస్తోందని చెప్పారు. ఇది భ్రష్టు పట్టిన పాలనని విమర్శించారు.