టెక్నాలజీ వచ్చినా.. పుస్తకాల విలువ తగ్గలేదు

Despite the advent of technology, the value of books has not decreased– ఎమ్మెల్యే పాయల్ శంకర్
– ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మారుతున్న కాలంలో కొత్త టెక్నాలజీ వచ్చిన పుస్తకాలకు ఉన్న విలువ తగ్గలేదని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపును బుధవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా పాల్గొన్నారు.  తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పాటలు పడగా.. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రంథాలయ అధికారులు శాలువతో సత్కరించి మొక్కను బహుకరించారు. గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పట్టి నేడు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు ఎంతో మంది సాధించారని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. గతంలో ఎటువంటి సాధనలు లేని సమయంలో సమాచారం కావాలన్న, పుస్తకం కావాలన్న లైబ్రరీపైనే ఆధారపడాల్సి వచ్చేదన్నారు. పాఠకులు ఏ విషయాన్ని అడిగి ఇక్కడి సిబ్బంది ఓపికగా వింటూ సహకరిస్తున్నారన్నారు. నిధులు లేకున్న అరకోర నిధులతో వ్యవస్థను గొప్పగ నడిపిస్తున్న అధికారులకు అభినందలు తెలిపారు. పాత వ్యవస్థల కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కావాల్సిన వాటి గురించి ప్రణాళికలు చేయాలని వాటిని పరిష్కారించేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాస్, సిబ్బంది కిరణ్, వంశీ, సతీష్, బీజేపీ నాయకులు సుభాష్ ఉన్నారు.