
మండలంలోని నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించి అనంతరం మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాలను పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు బుధవారం రోజు పరిశీలించి అధిక రేట్లు తీసుకోవద్దని వారికి సూచించారు. అనంతరం పత్తిపాక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.డి. అరిఫుద్దిన్, మండల గిర్దావర్ వరలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సుస్మిత, సిబ్బంది, మీ సవ కేంద్రాల నిర్వహకులు రాజమణి, తదితరులు పాల్గొన్నారు.