సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను: సుమన్ కుమార్

Will work to solve problems: Suman Kumarనవతెలంగాణ – ఆర్మూర్ 

సమస్యలు ఏమైనా ఉంటే తెలపాలని, విడుదల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టిఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసి, సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను తెలియజేసి, యూనిట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా పట్టణ యూనిట్ పక్షాన, వివిధ  శాఖల పక్షాన , శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కోశాధికారి టి దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్,గంగా కిషన్,జాఫర్ హుస్సేన్,అతిక్ హుస్సేన్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్ , వనమాల సుధాకర్  టీఎన్జీవో  యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు షికారి రాజు , గోవర్ధన స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ శశికాంత్ రెడ్డి, వివిధ శాఖల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.