కొబ్బరి నూనె కర్పూరంతో…

Coconut oil with camphorఈ రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు, దురద వంటివి సర్వసాధారణమై పోతున్నాయి. చాలా మంది మార్కెట్‌లో రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, కండిషనర్‌లను ఆశ్రయిస్తారు. వీటివల్ల ఫలితాలను పక్కనపెడితే.. కొన్నిసార్లు దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. రసాయనాలు స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీంతో ఫంగస్‌కూడా పెరుగుతుంది.
స్కాల్ప్‌ నుండి జెర్మ్స్‌, బ్యాక్టీరియాను తొలగిస్తుంది
కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే తలలో ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి, ఇవి స్కాల్ప్‌పై ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. కొబ్బరి నూనెతో జుట్టు మూలాలకు పోషణ అందించడం వల్ల జుట్టుకు బలం చేకూరి, ఫంగస్‌ సమస్యను దూరం చేస్తుంది. కొబ్బరి నూనె, కర్పూరాన్ని క్రమం తప్పకుండా వాడటంవల్ల స్కాల్ప్‌ ఆరోగ్యంగా ఉంటుంది, ఇది మంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది
కొబ్బరి నూనె, కర్పూరంను క్రమం తప్పకుండా వాడటంవల్ల జుట్టుకు సహజమైన మెరుపు, మృదుత్వం వస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ జుట్టు మూలాలకు పోషణనిచ్చి, జుట్టును మృదువుగా చేస్తాయి. కర్పూరం జుట్టుకు శుభ్రమైన, తాజా అనుభూతిని అందిస్తుంది.
ఇలా తయారుచేసుకోవాలి…
రెండు కర్పూరం బిళ్లలు తీసుకుని వాటిని పొడిచేసుకోవాలి.
అరకప్ప కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి. కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. అది కరిగే వరకూ వేడి చేసుకోవాలి.
తలస్నానం చేయటానికి అరగంట ముందు ఈ నూనెతో తలపై బాగా మసాజ్‌ చేసుకోవాలి. లేదా రాత్రి పడుకునేముందు తలకు రాసుకొని పొద్దున తలస్నానం చేయవచ్చు.
ఈ నూనెతో తలకు మసాజ్‌ చేయడం వల్ల హెయిర్‌ ఫోలికల్స్‌ వద్ద రక్త ప్రసరణ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.