భిన్న కథాకథనాలు

Different storiesనిర్మాత ఆర్‌బిచౌదరి సమర్పణలో మెగా సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘తల’. ఎన్‌.వి.ప్రసాద్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మాతలు. అమ్మ రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రంతో ఆయన తనయుడు అమ్మ రాగిన్‌ రాజ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో  బుధవారం ఈచిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ, ‘మూవీ టీజర్‌ మీకు బాగా నచ్చిందని  ఆశిస్తున్నాను. మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు ఈ సినిమా అంతే ఇంపార్టెంట్‌. నా కెరీర్‌లో దేవుడిగా భావించేది ఆర్‌.బి. చౌదరిని. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఆయన నాకు ఫస్ట్‌  అవకాశం ఇచ్చారు. ఆయన సినిమాలతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్మాణంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది.  ఇది చాలా డిఫరెంట్‌ స్టోరీ. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్‌, ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’ అని తెలిపారు. ‘నాన్న(అమ్మ రాజశేఖర్‌) ‘తల’  మూవీ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్‌ని బాగా చేయాలని ఫిక్స్‌ అయ్యాను. నాన్నకి మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. మీరంతా థ్రిల్‌ అయ్యేలా ఉంటుంది’ అని హీరో అమ్మ  రాగిన్‌ రాజ్‌ చెప్పారు.