నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉంటారు : వెంకటేష్‌

Non-stop smiling : Venkateshవెంకటేష్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో రూపొందిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు.
ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ,’సంక్రాంతికి ఒక మంచి ఎంటర్‌టైనర్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్‌ చేసి, ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. దర్శకుడు అనిల్‌తో వర్క్‌ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’ అని అన్నారు. ”గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో సంక్రాంతికి వండర్స్‌ క్రియేట్‌ చేయబోతున్నాం. అలాగే బాలయ్య ‘డాకు మహారాజ్‌’ సినిమాని కూడా మేమే రిలీజ్‌ చేస్తున్నాం. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి. ఈ సినిమా రషెస్‌ చూసి నాన్‌ స్టాప్‌గా నవ్వుకున్నాను. దర్శకుడు అనిల్‌ క్యాలెండర్‌లో ఈ సినిమా బెస్ట్‌ సినిమాగా నిలుస్తుంది’ అని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ,’సంక్రాంతికి నాకు స్పెషల్‌ కనెక్షన్‌ ఉంది. సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్‌ 2’, మహేష్‌తో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బ్లాక్‌ బస్టర్స్‌. మళ్ళీ ఈ సినిమాతో మీ అందరినీ నవ్వించడానికి వస్తున్నాం. ఎక్స్‌ కాప్‌, ఎక్స్‌గర్ల్‌ ఫ్రెండ్‌, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌ మధ్య జరిగే బ్యూటీఫుల్‌ జర్నీ ఇది. దీన్ని ఒక క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేశాం. ఖచ్చితంగా థ్రిల్‌ ఫీలౌతారు. వెంకటేష్‌, నా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ ఫిల్మ్‌గా రాబోతోంది’ అని అన్నారు.