మెప్పించే ‘సినిమా పిచ్చోడు’

A delightful 'Cinema Picchodu'ఎన్నేటి ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రం ‘సినిమా పిచ్చోడు’. కుమార్‌ స్వామి, సావిత్రి కష్ణ, కిట్టయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. కుమార్‌ స్వామి దర్శకుడిగానూ పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సంధ్య వెంకట్‌ నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ, ‘ఇదొక మంచి ఎమోషనల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. సినిమా కూడా అదే తరహాలో అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ని గీతామాధురి పాడారు. అన్ని పాటలు వినసొంపుగా ఉండటంతో సూపర్‌హిట్‌ అయ్యాయి’ అని తెలిపారు.