దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్ల రూపొందించిన చిత్రం ‘వీ4వీ’ (మోటీవ్ ఫర్ మర్డర్). ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఈ చిత్ర హిందీ ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఐఎమ్‌పిపిఎ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, దేశ, విదేశీయ సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ,’యూనివర్సల్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రమిది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు. మోటీవ్ ఫర్ మర్డర్ అని తెలిసినప్పుడు మైండ్స్ బ్లో అవుతాయి. అనూహ్యమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ చిత్రం ద్వారా నేను మీ అందరికీ అందించబోతున్నాను. త్వరలోనే ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కింది. జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, సత్యకష్ణ, ఎంఆర్‌సి వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ, స్క్రీన్ ప్లే: మోహన్ వడ్లపట్ల, రాహుల్ ఆడబాల, డైలాగ్స్: శ్రీచక్ర మల్లికార్జున, సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై, డిఓపీ: సంతోష్ షానమోని, ఎడిటింగ్: పవన్ ఆనంద్.