విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో ముచ్చటించారు. ‘ఈ సినిమాలో మాయ అనే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ ఇది. చాలా ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను. ఈ కథలో నా క్యారెక్టర్ కాంట్రీబ్యూషన్ చాలా క్రూషియల్‌గా ఉంటుంది. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకి చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి. చాలా విజిల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. డైరెక్టర్ రవితేజ చాలా అద్భుతంగా తీశారు. విశ్వక్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తనతో గతంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మిస్ అయ్యింది. ఈ సినిమాలో మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. జేక్స్ బిజోరు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి చాలా గ్రాండ్‌గా నిర్మించారు. టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్‌లో ఉంటుంది. నా తొమ్మిదేళ్ళ సినీ జర్నీలో ప్రతి సినిమాని ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుని, ముందుకు వెళుతున్నాను. నేను నటించిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతికి వస్తోంది. తమిళంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. విష్ణు విశాల్‌తో చేస్తున్న సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’.