ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు

Struggles against anti-democratic policies– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌
– ముగిసిన సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ అన్నారు. సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ బుధవారం ముగిసింది. పట్టణంలోని షాదిఖానాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అసరిస్తున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విపలమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ స్వార్థం కోసం కష్టజీవుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌ బాబు, జిల్లా కార్యదర్శి ముశం రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఏగమంటి ఎల్లారెడ్డి, గన్నరపు నరసయ్య, జవ్వాజి విమల, మల్లార అరుణ్‌ కుమార్‌, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, అశోక్‌ మల్లారపు ప్రశాంత్‌, గురజాల శ్రీధర్‌, శ్రీరామ్‌ సదానందం తదితరులు పాల్గొన్నారు.