రాష్ట్రంలో రైతులకు డబ్బులు ఇవ్వడంలో జిల్లా మొదటి స్థానం 

The district ranks first in giving money to farmers in the state– వడ్ల కొనుగోలు లో రెండవ స్థానం 
– డిఎంసిఎస్ జిల్లా అధికారి రాజేందర్ 
నవతెలంగాణ –  కామారెడ్డి 
రాష్ట్రంలో వడ్ల కొనుగోలు, రైతులకు డబ్బులు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా మొదటి, రెండవ స్థానంలో ఉందని జిల్లా డిఎంసిఎస్ అధికారి రాజేందర్ తెలిపారు. గతంలో రైతులు పండించిన వడ్లను అమ్మాలన్నా కొనాలన్నా ఎంతో ఇబ్బందులు పడేవారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వడ్ల కొనుగోలు 10 రోజులు ఆలస్యమైనప్పటికీ ఈనెల 19 వరకు గతంలో ఈ సమయానికి 2,50,512,640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సంవత్సరం సన్నవి దొడ్డివి కలుపుకొని 2,56,278,800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా 423 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 63 సెంటర్లో ప్రత్యేకంగా సన్న వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది అని 350 సెంటర్లలో సన్నవి, దొడ్డవి కలిపి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 19 వరకు 1,94,577,160 మెట్రిక్ టన్నుల దొడ్డు వడలను కొనుగోలు చేయడం జరిగిందని, 61,701,640 మెట్రిక్ టన్నుల సన్నం వడ్లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
రైతుల అకౌంట్లో డబ్బులు వేయడంలో మొదటి స్థానం…
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు రైతుల అకౌంట్లో 40 కోట్ల డబ్బులను వేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనివస్తుందని అంచనా వేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సన్నం వడ్లను  అమ్మిన రైతులలో 4401 రైతుల  అకౌంట్లో బోనస్ డబ్బులు 14 కోట్ల 93 లక్షల జనం చేయడం జరిగిందన్నారు. వడ్లను కొనుగోలు చేసిన రెండు మూడు రోజులలో రైతుల ఆకాంలలో డబ్బులు వేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుందనీ ఆయన పేర్కొన్నారు.