కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం మాచారెడ్డి మండలంలోని మినీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మాచారెడ్డీ మండల కేంద్రంలోని గిరిజన బాలికల మిని గురుకుల పాఠశాలను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి,విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడరు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాచారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను తనిఖీ చేశారు. పాఠశాలలో డిజిటల్ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.