టెట్ దరఖాస్తు తేదీని పెంచాలి

TET application date should be extended– డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

టెట్ దరఖాస్తు తేదీని పెంచాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు టెట్ దరఖాస్తుల గడువు తేదీని ప్రకటించడం జరిగింది కానీ సాంకేతిక కారణాలతో చాలామంది విద్యార్థులు పూర్తిస్థాయిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు సుమారుగా 50 నుంచి లక్ష మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు టెట్ దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 2.48 లక్షల మంది విద్యార్థులు ఇందులో పేపర్ 1కు- 71000  పేపర్ 2కు 1.55 , రెండు పేపర్లు రాసేవారు సుమారు 20000 దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. దరఖాస్తు తేదీని పొడిగిస్తే ఇంకో 50 వేల నుంచి లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి యువజన సంఘం ఈ ప్రభుత్వాన్ని టెట్టు దరఖాస్తు తేదీని ఇంకో రెండు వారాలు పాటు పొడిగించాలని కోరుతున్నామన్నారు.