ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పల్లికొండ సాయిబాబా పై నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో మచ్చ సహకార సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. నసురుల్లాబాద్ మండలం మైలారం మత్స్య పారిశ్రామిక సహకారం సంఘంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సంఘం సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పది సంవత్సరాల క్రితం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయి బాబా అనే వ్యక్తి మైలారం మచ్చ సహకార సంఘంలో సభ్యుడిగా ఉంటూ అధ్యక్షుడిగా పని చేశారు. పదివి కలం ముగించినప్పటికీ సొసైటీ కి సంబంధించిన రికార్డులను తన వద్ద ఉంచుకొని సొసైటీ కి రావలసిన నిధులను, పక్కదారి పట్టించారంటూ.. మత్స్య సహకార సంఘం డైరెక్టర్ జయశ్రీ, మాజీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ.. సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న పల్లికొండ సాయిబాబా మత్స్యకారులకు రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టారని వివరించారు. సంఘం సభ్యులకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బొలెరో వాహనం, మోపెడ్లు తీసుకున్నారన్నారని. ఎలాంటి తీర్మానం లేకుండానే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారన్నారని. సొసైటీ రికార్డులు అడిగితే తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొసైటీ కి సంబంధించిన రికార్డులను ఇవ్వకుండా సొసైటీ డైరెక్టర్ ను బెదిరిస్తున్న పల్లికొండ సాయిబాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మత్స్యకారులు కోరారు. మత్స్యకారులు ఇచ్చిన ఫిర్యాదు మెరుగు విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.