నల్లగొండలో సీపీఐ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

CPI public meeting in Nalgonda should be attended in large numbers– కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలి: బొడ్డుపల్లి వెంకటరమణ
నవతెలంగాణ – డిండి
డిసెంబర్ 30న నల్లగొండలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ పిలుపునిచ్చారు. మండలంలోని గోనకొల్ గ్రామంలో గురువారం రాత్రి మండారి వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సీపీఐ గ్రామశాఖ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్ గారు. సీపీఐ ఆవిర్భావ విజయోత్సవ సంబరాలను నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎర్రజెండాలతో రెపరెపలాడించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరణ చేయాలని అన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడానికి పార్టీ కృషిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గెలిచిన తర్వాత   నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచి ప్రజలపై పన్నుల భారం మోపుతూపేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుం దన్నారు. కేంద్రంలోని బాజేపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పాలని భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు యం.డి. మైనోద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి, సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్, మాజీ సర్పంచ్ బొల్లె మంజుల, కళ్యాణ్, ప్రవీణ్, వినయ్, శ్రీకాంత్, సుందరమ్మ, శేఖర్, రాజు, మనోజ్, దేవయ్య, లింగయ్య, కుమార్, అనసూయ, పద్మమ్మ, శ్రీకాంత్, సైదయ్య, అంజి, రజినీకాంత్, రాములమ్మ, లక్ష్మమ్మ, భాగ్యమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.