అదే.. ఈ బర్త్‌డే గిఫ్ట్‌

That's it.. this birthday gift‘మాకు స్ఫూర్తినిచ్చిన మా నాన్న (మోహన్‌బాబు) నటుడిగా 50వ వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టడం, నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ తుది మెరుగులు దిద్దుకుంటూ, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండటాన్ని ఈ బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను’ అని అన్నారు మంచు విష్ణు. మోహన్‌బాబు తనయుడిగా వెండితెరంగేట్రం చేసి హీరోగా తనకంటూ ఓ  ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మంచు విష్ణు పుట్టినరోజు నేడు (శనివారం). బాలనటుడిగా ‘రగిలే గుండెలు’ (1985) సినిమాతో కెమెరా ముందుకొచ్చిన విష్ణు  మంచు..2003లో ‘విష్ణు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాకుగాను ఉత్తమ నూతన హీరోగా ఫిలిం ఫేర్‌ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘సూర్యం,  పొలిటికల్‌ రౌడీ, అస్త్రం, గేమ్‌’ సినిమాల్లో నటించారు. ‘ఢ’ మూవీ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. ‘దేనికైనా రేడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం, లక్కున్నోడు, గాయత్రి,  ఆచారి అమెరికా యాత్ర, జిన్నా’ లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి, మెప్పించారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన  ‘కన్నప్ప’లో కన్నప్పగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.