‘ఎర్రచీర’ రిలీజ్‌కి రెడీ

'Errachira' is ready for releaseబేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్‌, శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్‌’. రాజేంద్రప్రసాద్‌ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. సుమన్‌ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. డిసెంబర్‌ 20న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘తొలి.. తొలి ముద్దు’ సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శక, నిర్మాత సుమన్‌ బాబు మాట్లాడుతూ, ‘హర్రర్‌, మదర్‌ సెంటిమెంట్‌, యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌లో ఒక మంచి రొమాంటిక్‌ సాంగ్‌ రూపొందించాలని అనుకున్నాం. భార్యా భర్తల మధ్య వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ ఇది. ముద్దు అనే పదంతో పాట ఉండాలని అనుకున్నాం. మా ఆలోచనకు తగినట్లే జయసూర్య మంచి లిరిక్స్‌ ఇచ్చారు. అలాగే ప్రమోద్‌ ఆకట్టుకునేలా కంపోజ్‌ చేశారు. ఈ పాటలో సెట్‌ వర్క్‌ ఆకర్షణగా నిలుస్తుంది. 3 రోజులు ఈ పాట చిత్రీకరించాం. మేము అనుకున్నట్లే బాగా వచ్చింది. డిసెంబ్‌ 15వ తేదీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తాం. ఈ సాంగ్‌పై రీల్స్‌, షార్ట్స్‌ చేసి మాకు పంపిస్తే ది బెస్ట్‌ అనిపించిన వాటికి ఫస్ట్‌ప్రైజ్‌గా లక్ష రూపాయలు, సెకండ్‌ ప్రైజ్‌ యాభై వేలు, థర్డ్‌ ప్రైజ్‌ పాతిక వేలు బహుమతిగా అందిస్తాం’ అని అన్నారు.